- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఓయూ ప్రొఫెసర్లు..
by Batti.Sumithra |
ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు, ప్రొఫెసర్లు సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

X
దిశ, సికింద్రాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు, ప్రొఫెసర్లు సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం ఉద్యోగుల సీపీఎస్, ఓపీఎస్ సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీని పై ఉపముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. ఈ అంశానికి త్వరలోనే సానుకూల పరిష్కారం లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి, వీసీ ఓఎస్‌డీ ప్రొఫెసర్ ఎస్. జితేందర్ కుమార్ నాయక్, ప్రొఫెసర్లు జి. మల్లేశం, పి. చంద్రశేఖర్, సి.హెచ్. శ్రీనివాస్, బి. మంగు, రాజేందర్ నాయక్, డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Next Story






