- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తరలింపు..
ఒక పెట్రోల్ బంకులో ఉన్న పెట్రోల్ ను ట్యాంకర్లు నింపుకొని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, నల్లగొండ బ్యూరో : ఒక పెట్రోల్ బంకులో ఉన్న పెట్రోల్ ను ట్యాంకర్లు నింపుకొని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్పీ ఆఫీస్ పక్కనే ఉన్న ఓ పెట్రోల్ బంకులో నుంచి ఓ పెట్రోల్ ట్యాంకర్ లో పెట్రోల్ నింపుకొని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఒక బంక్ లో ఉన్న పెట్రోల్ ను ఇతర బంకులకు తరలించడానికి వీల్లేదు. కానీ ఈ మధ్య నల్లగొండ పట్టణంలోని చాలా బంకుల ద్వారా ఇదే విధంగా పెట్రోలు డీజిల్ ను తరలిస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మాదిరిగా పెట్రోల్ బంక్ యజమానులకు కమిషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఆ కమిషన్ కొట్టేయడానికి అలా ఒక బంకు నుంచి మరొక బంకుకు రాత్రివేళ తరలిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయం పై సంబందిత అధికారి దీపక్ కుమార్ ను సంప్రదించగా నాకు సంపూర్ణ అవగాహన లేదు. జిల్లా అధికారి కనుక్కుంటానని తెలిపారు. ఇలా కమిషన్ కొట్టేయడానికి జరుగుతున్న తతంగం లో పెట్రోల్ బంకు యజమానులకు అధికారులకు మధ్య లావాదేవీల ఒప్పందం కుదిరినట్లు సమాచారం.






