ఆక్వారైతులు అల్టిమేటం.. జిల్లా కేంద్రంలో నిర‌స‌న‌

by Vemula.Srinu Prasad |

సిండికేట్‌గా ఏర్ప‌డిన మేత‌ల త‌యారీ దారులు రైతుల‌ను న‌ట్టేట ముంచేలా ఇష్టారాజ్యంగా మేత‌ల ధ‌ర‌లు పెంచుతున్నార‌ని ఆక్వారైతు సంఘ నాయ‌కులు మండిప‌డ్డారు. రాష్ట్ర ఆక్వారైతు సంఘం పిలుపు మేర‌కు అమ‌లాపురంలో క్ష‌త్రియ క‌ళ్యాణ‌ మండ‌పం వ‌ద్ద కోన‌సీమ‌ జిల్లా ఆక్వారైతు సంఘ అధ్య‌క్షుడు దెందుకూరి స‌త్తిబాబు రాజు అధ్య‌క్ష‌త‌న జిల్లా స్థాయి ఆక్వారైతులు అత్య‌వస‌ర స‌మావేశం నిర్వ‌హించారు. ..

ఆక్వారైతులు అల్టిమేటం.. జిల్లా కేంద్రంలో నిర‌స‌న‌
X

దిశ, అమ‌లాపురం: సిండికేట్‌గా ఏర్ప‌డిన మేత‌ల త‌యారీ దారులు రైతుల‌ను న‌ట్టేట ముంచేలా ఇష్టారాజ్యంగా మేత‌ల ధ‌ర‌లు పెంచుతున్నార‌ని ఆక్వారైతు సంఘ నాయ‌కులు మండిప‌డ్డారు. రాష్ట్ర ఆక్వారైతు సంఘం పిలుపు మేర‌కు అమ‌లాపురంలో క్ష‌త్రియ క‌ళ్యాణ‌ మండ‌పం వ‌ద్ద కోన‌సీమ‌ జిల్లా ఆక్వారైతు సంఘ అధ్య‌క్షుడు దెందుకూరి స‌త్తిబాబు రాజు అధ్య‌క్ష‌త‌న జిల్లా స్థాయి ఆక్వారైతులు అత్య‌వస‌ర స‌మావేశం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆక్వా రైతు సంఘ రాష్ట్ర కార్య‌ద‌ర్శి త్స‌వ‌ట‌ప‌ల్లి నాగ‌భూష‌ణం హాజ‌రై మాట్లాడారు.

ఈసంద‌ర్భంగా నాగ‌భూష‌ణం మాట్లాడుతూ ఆక్వారైతులు పెరిగిన పెట్టుబ‌డుల‌తో న‌ష్టాల్లో కూరుపోతున్న సమ‌యంలో మేత‌ల త‌యారీదారులు ధ‌ర‌లు పెంచ‌డం దారుణ‌మ‌న్నారు. ప్ర‌భుత్వం మేత‌ల కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నక్ర‌మంలో కూడా అవేమీ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తూ ఏక‌పక్షంగా మేత‌ల ధ‌ర‌లు పెంచ‌డం ఉద్దేశ్య‌పూర్వ‌క‌మేన‌న్నారు. ప్ర‌భుత్వం కూడా ఆక్వారైతుల ఇబ్బందుల‌ను ఏమాత్రం ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం స‌రైంది కాద‌న్నారు. పెంచిన ఆక్వామేత‌ల ధ‌ర‌ల‌ను నిర‌సిస్తూ జిల్లా కేంద్ర‌మైన అమ‌లాపురంలోని న‌ల్ల‌వంతెన ధ‌ర్నా చౌక్ వ‌ద్ద మంగ‌ళ‌వారం ఉద‌యం నిర‌స‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈకార్య‌క్ర‌మానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతులు త‌ర‌లివచ్చి కార్యక్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న కోరారు. సంఘ‌ జిల్లా అధ్య‌క్షుడు దెందుకూరి స‌త్తిబాబు రాజు మాట్లాడుతూ మేత‌ల త‌యారీ దారులు సిండికేట్‌గా మారి ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ప్ప‌టికీ అవేమీ ప‌ట్ట‌కుండా ఏక‌ప‌క్షంగా ధ‌ర‌లు పెంచాయ‌న్నారు. దేశానికి విదేశీ మార‌క‌ద్ర‌వ్యాన్ని తీసుకొచ్చే ఆక్వా ప‌రిశ్ర‌మ‌లోని ఇబ్బందుల‌పై వెంట‌నే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చొర‌వ చూపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. ఆక్వా రైతుల‌ను అన్నివిధాలుగా దోచుకుంటున్న సిండికేట్ వ్య‌వ‌స్థ రూపుమాపాల‌న్నారు.

ఈకార్య‌క్ర‌మంలో రైతు నాయ‌కులు రుద్ర‌రాజు నానీరాజు, అల్లూరి ర‌మేష్‌రాజు, చెయ్యేరు సూరిబాబు రాజు, త్స‌వ‌ట‌ప‌ల్లి నాగు, పోతుకూరి స‌త్తిబాబు, త్స‌వ‌ట‌ప‌ల్లి మ‌ణికుమార్, రుద్ర‌రాజు శ్రీ‌నివాస‌రాజు, మోటూరి నాని, మేడిద శంక‌రం, రుద్ర‌రాజు సూరిబాబు రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story