- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమర్ నాథ్ అన్నదాన సేవ సమితి సేవలు అభినందనీయం
అమర్ నాథ్ అన్నదాన సేవ సమితి సేవలు సిద్దిపేట ఖ్యాతిని దేశ వ్యాప్తం చేశాయని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : అమర్ నాథ్ అన్నదాన సేవ సమితి సేవలు సిద్దిపేట ఖ్యాతిని దేశ వ్యాప్తం చేశాయని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. అమర్ నాథ్ యాత్ర సరుకుల తీసుకెళ్లే లారీని సిద్దిపేట శరభేశ్వర దేవాలయం వద్ద మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ...అమర్ నాథ్ యాత్రికులకు దక్షిణాది రుచులతో భోజనం అందించే ఏకైక లంగర్ సిద్దిపేట అమర్ నాథ్ అన్నదాన సేవ సమితి వారిది అన్నారు. స్వచ్చ సిద్దిపేటగా, గ్రీన్ సిద్దిపేట గా, సేవ కార్యక్రమాల పరంగా సిద్దిపేట ప్రాంతం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు. అమర్ నాథ్ అన్నదాన సేవ సమితి కార్యక్రమాలు చిరస్థాయిగా కొనసాగించే విధంగా సిద్దిపేట పట్టణంలో నిర్మిస్తున్న అమర్ నాథ్ అన్నదాన సేవ సమితి భవన నిర్మాణానికి తన వంతు సాయం అందజేస్తానని హామీ నిచ్చారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ... 15 సంవత్సరాలుగా అమర్ నాథ్ అన్నదాన సమితి ఆధ్వర్యంలో అమర్ నాథ్ యాత్రకు వచ్చే యాత్రికుల దక్షిణాది రుచులతో భోజనం అందించడం అభినందనీయం అన్నారు. అమర్ నాథ్ యాత్ర ప్రాంతంలో అమర్ నాథ్ అన్నదాన సేవ సమితి కి స్థలం కేటాయించే విధంగా ప్రయత్నిస్తానని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు శివ్వా శ్రీనివాస్, చైర్మన్ చీకోటి మధుసూదన్, ప్రధాన కార్యదర్శి మాంకాల నవీన్ కుమార్, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






