- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో డ్రైనేజీ పనులు పూర్తి చేస్తాం
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని లోనెట్టా విల్లాస్ వద్ద జరుగుతున్న డ్రైనేజీ పనులను సోమవారం రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులు పరిశీలించారు.

దిశ, గండిపేట: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని లోనెట్టా విల్లాస్ వద్ద జరుగుతున్న డ్రైనేజీ పనులను సోమవారం రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులు పరిశీలించారు. పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహకారంతో మూసి నుంచి లునెట్ విల్లాస్, క్రేయాన్స్ హాస్పిటల్, వైష్ణవి ఓయాసిస్ వరకు చేపట్టిన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు మరికొద్ది రోజుల్లో పూర్తి చేయనున్నట్లు వివరించారు. వర్షాకాలంలో మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదేశాల మేరకు ప్రారంభమైన ఈ పనులను నెల రోజులుగా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని, పూర్తయిన తర్వాత స్థానిక ప్రజలకు మెరుగైన డ్రైనేజీ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా చాలా రోజులుగా స్థానిక ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ నరేందర్ గౌడ్, డీఈ యాదయ్య, ఏఈ నరసింహమూర్తి పాల్గొన్నారు.






