మా గొంతును వినిపిస్తూనే ఉంటాం.. దాడిపై కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన నిరసన కార్యక్రమం సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దుండగులు దాడి చేశారు.

మా గొంతును వినిపిస్తూనే ఉంటాం.. దాడిపై కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన నిరసన కార్యక్రమం సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దుండగులు దాడి చేశారు. షహీద్ స్మారక్ వద్ద కార్యక్రమానికి చేరుకున్న దీప్కేపై జనసమూహంలో ఉన్న వ్యక్తి వరుసగా నాలుగు సార్లు చెంపదెబ్బలు కొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పార్టీ కార్యకర్తలు దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకోగా, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై అభిజీత్ దీప్కే ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ‘భౌతిక దాడులు భయం, పిరికితనానికి సంకేతం. శాంతియుతంగా మా గొంతును వినిపిస్తూనే ఉంటాం. నేను గాంధీ, అంబేద్కర్ సిద్ధాంతాలను అనుసరిస్తాను. శాంతి, ప్రేమతో ఈ పోరాటాన్ని కొనసాగిస్తాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి’ అని పేర్కొన్నారు. కాగా, పరీక్షల అవకతవకలు, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, అవినీతి వంటి అంశాలపై సీజేపీ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

Next Story