- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోడ కూలి బాలుడికి తీవ్ర గాయాలు
by Batti.Sumithra |
ఆటవిడుపుగా ఆడుకుంటున్న పిల్లల పై ప్రమాదవశాత్తు గోడ కూలిన ఘటనలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో జరిగింది.

X
దిశ, నేలకొండపల్లి : ఆటవిడుపుగా ఆడుకుంటున్న పిల్లల పై ప్రమాదవశాత్తు గోడ కూలిన ఘటనలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో జరిగింది. రాజేశ్వరపురం గ్రామంలోని పాత మిల్లు సమీపంలో కొందరు పిల్లలు ఆదుకుంటుండగా ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో శిధిలావస్థలో ఉన్న గోడ ఒక్కసారిగా కూలినట్లు తెలిసింది. ఈ ఘటనలో బత్తిని వరుణ్ (12)అనే బాలుడు తీవ్రంగా గాయపడటంతో నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స అనంతరం బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో 108 లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






