- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా భర్త నుంచి భరణం ఇప్పించండి : ఓ బాధితురాలి వేడుకోలు
ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భార్యను, కుమార్తెను కట్టుకున్న భర్త వదిలేశాడు.

దిశ, చైతన్యపురి : ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భార్యను, కుమార్తెను కట్టుకున్న భర్త వదిలేశాడు. మరో మహిళతో సహజీవనం చేస్తూ ఇద్దరు మగ పిల్లలకు తండ్రయ్యాడు. విషయం తెలుసుకున్న భార్య తన బంధువులతో కలిసి భర్త నివాసం ఉంటున్న చోట నిలదీసింది. తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకెళితే వనపర్తి జిల్లాకు చెందిన అర్చనకు 2012లో అదే జిల్లాకు చెందిన రవితో వివాహం జరిగింది. వివాహానంతరం ఉమ్మడి కుటుంబం పేరుతో ఇంటి పనులు, వ్యవసాయ పనులు చేయించడంతో పాటు అత్తింటి వేధింపులు ఎదుర్కొన్నానని అర్చన ఆరోపించింది. ఆడపిల్ల పుట్టిన తర్వాత భర్త, అత్తింటి వారి వైఖరిలో మార్పు వచ్చిందని, తనను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారని తెలిపింది. తనకు ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భర్త రవి వనపర్తి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడని, అయితే ఆ పిటిషన్ పై న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయన్నారు. సెటిల్మెంట్ కోసం ఈనెల 28న ఫైనల్ హియరింగ్ ఉండగా న్యాయస్థానంకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు బాధితురాలు పేర్కొంది.
రవి పేరు మీద ఉన్న 10 ఎకరాల భూమి ఎక్కడ తనకు తన కూతురికి ఇవ్వాల్సి వస్తుందని ముందుగానే భావించి ముందస్తు ప్రణాళిక ప్రకారం తమ అక్క పేరు మీద 8 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారని అర్చన ఆరోపించింది. అనంతరం తనకు దూరంగా ఉంటూ హైదరాబాద్‌కు మకాం మార్చిన రవి మరో మహిళతో సహజీవనం చేస్తూ ఇద్దరు మగ పిల్లలకు తండ్రిగా మారాడని తెలిపింది. ఇటీవల కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో భర్త నివాసం వద్దకు వెళ్లిన అర్చన, అతడు మరో మహిళతో కలిసి జీవిస్తున్న విషయాన్ని గుర్తించానని పేర్కొంది. దీంతో తనకు, తన కుమార్తెకు న్యాయం చేసి భరణం ఇప్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటుంది. రవిని పట్టుకుని సరూర్ నగర్ పోలీసులకు అప్పజెప్పి మాకు న్యాయం చేయాలని కోరింది. ఈ ఘటన పై మహిళా సంఘాలు, పోలీసు అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కుమార్తె పుట్టడాన్ని కారణంగా చూపి కుటుంబాన్ని విడిచిపెట్టడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






