- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్)ను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే 119 వాహనాల కొనుగోలుకు అనుమతిస్తూ మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో డీఆర్ఎఫ్ ట్రక్స్ 21, ఇన్నోవా (హైక్రాస్) రెండు, ఇన్నోవా 1, స్కార్పియో 54, ట్రూప్ క్యారియర్ వ్యాన్లు రెండు, బస్సులు రెండు, బైకులు 37తో పాటు 21 డీఆర్ఎఫ్ ఎక్విప్‌మెంట్స్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. బడ్జెట్ రాగానే అధికారులు కొనుగోలు చేయడానికి టెండర్లు పిలవనున్నారు.
72 డీఆర్ఎఫ్ టీమ్స్..
తమ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఏరియాల్లో విపత్తుల నిర్వహణకు 72 డీఆర్ఎఫ్ టీమ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 51 టీమ్స్ పనిచేస్తున్నాయి. ఒక్కో టీమ్‌లో ఆరుగురు ఉంటారు. 24/7 పనిచేయడానికి మూడు షిఫ్ట్‌లుగా అంటే రోజుకు మూడు టీమ్స్ పనిచేస్తున్నాయి. 51 టీమ్స్‌లో 918 మంది ఉన్నారు. 21 డీఆర్ఎఫ్ బైకులు ఉన్నాయి. రోజుకు మూడు టీమ్స్ అందుబాటులో ఉంటాయి. మొత్తం 63 మంది పనిచేస్తున్నారు.
300 మెట్ (MET) టీమ్స్..
జీహెచ్ఎంసీలో 150 వార్డులు, సీఎంసీలో 76, ఎంఎంసీలో 74 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డుకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ (ఎంఈటీ) ఏర్పాటు చేయడానికి హైడ్రా టెండర్లు పిలిచింది. వీటిలో 150 టీమ్స్‌కు సంబంధించిన టెండర్లు ఫైనల్ చేశారు. ఒక్కో టీమ్‌లో వాహనంతో పాటు ముగ్గురు కార్మికులు, డ్రైవర్, సూపర్‌వైజర్ మొత్తం ఐదుగురు ఉంటారు. వీరిలో హైడ్రా నుంచి ఇద్దరు ఉంటారు. అంటే 300 టీమ్స్‌కు 600 మంది ఉంటారు. మిగిలిన 150 టెండర్లను త్వరలోనే ఫైనల్ చేయనున్నట్లుగా హైడ్రా అధికారులు చెబుతున్నారు.






