టార్గెట్ సెట్ టైటిల్ ఫిక్స్.. D55 నుంచి అదిరిపోయే అప్డేట్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

టార్గెట్ సెట్ టైటిల్ ఫిక్స్.. D55 నుంచి అదిరిపోయే అప్డేట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఆయన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మంగా రాబోతున్న ‘D-55’ అప్డేట్‌కు టార్గెట్ ఫిక్స్ అయినట్లు తెలుపుతూ ఓ సాలిడ్ పోస్టర్ షేర్ చేశారు. ఈ మేరకు ఓ పెద్ద చెట్టు దుంగపై రక్తంతో తడిసిన గొడ్డలి ఉన్న పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘లక్ష్యం నిర్దేశించబడింది.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న D55 అప్‌డేట్‌కు సమయం ఆసన్నమైంది.. జూన్ 18న రాబోతోంది సిద్ధంగా ఉండండి’ అంటూ తెలిపారు. దీంతో ఈ పోస్టర్ కాస్త వైరల్‌గా మారడంతో.. ‘టైటిల్ ఫిక్స్ అయింది.. వెయిటింగ్’ అంటూ కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. కాగా.. ఈ చిత్రానికి ‘అమరన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల, సూపర్ స్టార్ మమ్ముట్టి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story