నాలుగేళ్ల బాలుడి అదృశ్యం..

by Kodari Anjali |

నందిపేట మండలం వన్నెల్ (కే) గ్రామానికి చెందిన అమీర్ కురేషి (14) అనే బాలుడు అదృశ్యమైనట్లు ఎస్సై వినయ్ తెలిపారు.

నాలుగేళ్ల బాలుడి అదృశ్యం..
X

దిశ, నందిపేట: నందిపేట మండలం వన్నెల్ (కే) గ్రామానికి చెందిన అమీర్ కురేషి (14) అనే బాలుడు అదృశ్యమైనట్లు ఎస్సై వినయ్ తెలిపారు. మహారాష్ట్రలోని బస్మత్ జిల్లా హింగోలి కి చెందిన బిలాల్ ఖురేషి బతుకుదేరువు కోసం కుటుంబంతో కలిసి గత నాలుగేళ్ల కిందట ఇక్కడికి వచ్చారని చెప్పారు. స్థానికంగా మటన్ దుకాణం నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాడని వివరించారు. ఈయన నాలుగేళ్ల కొడుకు అమీర్ ఖురేషి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆరుబయట ఆడుకునేందుకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని తెలిపారు. అప్పటినుంచి ఇరుగుపొరుగు వద్ద ఆచూకీ కోసం వాకబు చేసిన ఫలితం లేకపోవడంతో ఫిర్యాదు ఇచ్చినట్లు వెల్లడించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. ఎవరికైనా ఈ బాబు ఆచూకీ తెలిస్తే ఈ నెంబర్ కి 8712659861 (నందిపేట ఎస్సై) కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

Next Story