చంచల్‌గూడ జైలులో బాల్క సుమన్‌.. పరామర్శించిన మహమూద్ అలీ

by Batti.Sumithra |

చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మాజీ హోంమంత్రి మహమూద్ అలీ సోమవారం ములాఖత్‌లో కలిసి పరామర్శించారు.

చంచల్‌గూడ జైలులో బాల్క సుమన్‌.. పరామర్శించిన మహమూద్ అలీ
X

దిశ, చంపాపేట్ : చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మాజీ హోంమంత్రి మహమూద్ అలీ సోమవారం ములాఖత్‌లో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాల్క సుమన్ ఆరోగ్య పరిస్థితి, జైలు పరిస్థితులు తదితర అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. మహమూద్ అలీతో పాటు బీఆర్ఎస్ నాయకులు ధర్మరాజు, నర్సింగ్, సుభాష్ కాటేకర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కూడా జైలుకు చేరుకుని బాల్క సుమన్‌కు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. పార్టీ శ్రేణులంతా ఆయనకు అండగా ఉంటాయని, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ముందుకు సాగాలని నాయకులు సూచించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకులను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చట్టపరమైన పోరాటం కొనసాగుతుందని, న్యాయం తప్పకుండా విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చంచల్‌గూడ జైలులో జరిగిన ఈ పరామర్శ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బాల్క సుమన్‌కు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు వరుసగా పరామర్శలు నిర్వహించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని, నాయకత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.

Next Story