నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ..

by Kodari Anjali |

తాగు నీటి సమస్యలను యుద్ధ ప్రాతిపాదికన పరిష్కరించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులను ఆదేశించారు.

నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ..
X

దిశ, కుత్బుల్లాపూర్: తాగు నీటి సమస్యలను యుద్ధ ప్రాతిపాదికన పరిష్కరించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం 131వ కుత్బుల్లాపూర్ డివిజన్‌లోని రామకృష్ణ నగర్, బాల్‌రెడ్డి నగర్ ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించిన ఆయన, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ నగర్ వాసులు తాగునీటిలో మురుగునీరు కలవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరగడం వల్ల తాగునీరు సరిపోవడం లేదని వాపోయారు. బాల్‌రెడ్డి నగర్ వాసులు కూడా లో ప్రెజర్ కారణంగా తాగునీటి కొరత ఏర్పడిందని, పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్డు పనులను పూర్తి చేయడంతో పాటు పార్కు వద్ద ఉన్న విద్యుత్ వైర్ల సమస్యను పరిష్కరించాలని కోరారు.

తక్షణ చర్యలు తీసుకోవాలి...

అనంతరం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ, వేసవి కాలంలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరగడం వల్ల కాలనీల్లోని చివరి ఇళ్ల వరకు నీరు అందడం లేదని పేర్కొన్నారు. త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేలా తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఇంజినీరింగ్ ఈఈ భద్రు, వాటర్ వర్క్స్ డీజీఎం ప్రసాద్ రావు, ఏఈ గోపాలకృష్ణ, ఎలక్ట్రికల్ అధికారి రవీందర్ రెడ్డి, వర్క్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్, మాజీ కౌన్సిలర్లు కిషన్‌రావు, సూర్యప్రభ, బీఆర్ఎస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Next Story