సరికొత్త ఆలోచనలు పంచుకున్నాం: సింగపూర్ మంత్రితో భేటీపై చంద్రబాబు ట్వీట్

by Vemula.Srinu Prasad |

సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో భేటీ తనకు చాలా సంతోషాన్నిచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సింగపూర్ పర్యటన విశేషాలను ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.

సరికొత్త ఆలోచనలు పంచుకున్నాం: సింగపూర్ మంత్రితో భేటీపై చంద్రబాబు ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌(Singapore Foreign Minister Vivian Balakrishnan)తో భేటీ తనకు చాలా సంతోషాన్నిచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. సింగపూర్ పర్యటన విశేషాలను ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. సింగపూర్ మంత్రితో అత్యంత ఆత్మీయంగా, ఫలప్రదంగా చర్చలు జరిగాయని చెప్పారు. గతంలో తము కలుసుకున్న సందర్భాలను ఈ మీట్‌లో నెమరువేసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ - సింగపూర్ మధ్య ఆర్థిక సంబంధాలపైనే తమ మధ్య చర్చ కొనసాగిందన్నారు. విమాన, వైమానిక సర్వీసుల బలోపేతం, కనెక్టివిటీ సౌకర్యాల మెరుగుదలపై ప్రధానం చర్చ జరిగిందని చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా ఆ రెండు సంస్థల అనుసంధానం. మరింత పటిష్టపైనా విస్తృత చర్చ జరిగిందని చంద్రబాబు చెప్పారు.

అలాగే డిజిటల్ మౌలిక సదుపాయాలపైనా చర్చ జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. సముద్రగర్భ ఇంటర్నెట్ కనెక్టివిటీ, డేటా సెంటర్ డెవలప్‌మెంట్, కమర్షియల్ స్పేస్ రంగంపై చర్చించి సరికొత్త అవకాశాలపై ఆలోచనలు పంచుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను ఎలా తీర్చిదిద్దబోతున్నామనే తమ విజన్‌ను సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌‌కు వివరించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Next Story