మేడ్చల్ జిల్లాలో అంతులేని విషాదం.. చెరువులో పడి ఇద్దరు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-15 13:49:59  IST  )

మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని ధర్మారం చెరువు వద్ద ఫోటో షూట్‌కు వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తూ నీట మునిగారు.

మేడ్చల్ జిల్లాలో అంతులేని విషాదం.. చెరువులో పడి ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా కీసర (Keesara) పరిధిలో అంతులేని విషాదం చోటుచేసుకుంది. సరదాగా సాగాల్సిన ఫొటో షూట్ ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. స్థానిక ధర్మారం చెరువు (Dharmaram Lake)లో ఫొటో షూట్ కోసం వెళ్లిన యువకులలో ఇద్దరు నీట మునిగి మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. మండల పరిధిలోని ధర్మారం చెరువు వద్ద ఇవాళ కొందరు యువకులు ఫొటో షూట్ కోసం వెళ్లారు. అక్కడ ఫొటోలు తీసుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తూ ముగ్గురు యువకులు నీటిలో పడిపోయారు. చెరువు లోతు ఎక్కువగా ఉండటంతో వారు నీటిలో మునిగిపోయారు. అయితే, యువకులు నీట మునగడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్‌డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు స్పాట్‌ చేరుకున్నాయి. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం ఇద్దరు యువకుల మృతదేహాలను వెలికితీయగా.. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Next Story