- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన గుండుమాల్ గ్రామ ప్రతినిధులు..
శ్రీ పోచమ్మ దేవత నూతన గుడి ప్రారంభోత్సవానికి గుండుమాల్ గ్రామ ప్రతినిధులు ఆహ్వానించారు.

దిశ, గుండుమాల్: నారాయణపేట్ జిల్లా గుండుమాల్ గ్రామంలో నిర్వహించనున్న శ్రీ పోచమ్మ దేవత నూతన గుడి ప్రారంభోత్సవం మరియు నాభిశిల (బొడ్రాయి) విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా గ్రామ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. జూన్ 16 నుంచి 18, 2026 వరకు నిర్వహించనున్న ఈ ఆధ్యాత్మిక మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకుడు అంజయ్య యాదవ్ మాట్లాడుతూ..
ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది...
గుండుమాల్ గ్రామ ప్రజల చిరకాల కోరిక మేరకు ఆలయ నిర్మాణం పూర్తై ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామ ప్రజలందరికీ ఇది ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాకుండా గ్రామ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, అంకురార్పణ, అధివాస హోమాలు, యంత్ర ప్రతిష్ఠాపన, ప్రాణ ప్రతిష్ఠాపన, మహా మంగళహారతి వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసి సహకరించాలని అంజయ్య యాదవ్ కోరారు. కార్యక్రమ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మధుకర్ రావ్, మల్లెల గోపాల్, నర్సిములు గౌడ్, వెంకటేష్, తదితరులు నాయకులు పాల్గొన్నారు






