రైలు ఢీకొని యువకుని మృతి..

by Kodari Anjali |

అంగవైకల్యం, మతి స్థిమితం లేని యువకుడు రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో మరణించాడు.

రైలు ఢీకొని యువకుని మృతి..
X

దిశ, నవీపేట్ : అంగవైకల్యం, మతి స్థిమితం లేని యువకుడు రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో ఘటన స్థలంలో మృతి చెందిన సంఘటన నవీపేట్ మండల కేంద్రంలో జరిగింది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు మండల కేంద్రం సుభాష్ నగర్ కు చెందిన మనుమాల శివకుమార్ (25) అంగవైకల్యం మరియు మతిస్థిమితం సరిగా లేక సోమవారం నవీపేట్ రైల్వే స్టేషన్ వద్ద, రైలు పట్టాలు దాటుచుండగా.. గుర్తు తెలియని రైలు ఢీకొని తనపైనుండి వెళ్ళగా, కలిగిన గాయాలవల్ల అక్కడికక్కడే మృతి చెందాడని, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని రైల్వే ఎస్సై సాయరెడ్డి తెలిపారు.

Next Story