మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజావాణి.. మొత్తం 194 ఫిర్యాదులు, సీఎంసీలోనే అత్యధికం

by Kema Shiva Kumar |

మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజావాణి.. మొత్తం 194 ఫిర్యాదులు, సీఎంసీలోనే అత్యధికం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కోర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో మొత్తం 194 ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా సీఎంసీ (CMC)లో 97 ఫిర్యాదులు రాగా, ఆ తర్వాత జీహెచ్ఎంసీ (GHMC)లో 73, ఎంఎంసీ (MMC)లో 24 ఫిర్యాదులు నమోదయ్యాయి. సీఎంసీ కమిషనర్ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. అందిన ప్రతి వినతిని సంబంధిత శాఖాధిపతులు క్షుణ్ణంగా పరిశీలించి, ప్రాధాన్యత ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో వేగం, పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉండాలని కమిషనర్ సూచించారు. సీఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన మొత్తం 97 ఫిర్యాదులు, వినతులను తదుపరి పరిశీలన, పరిష్కార చర్యల కోసం సంబంధిత శాఖలకు పంపించారు. వీటిలో టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందినవి 77 కాగా, ఇంజినీరింగ్ విభాగానికి చెందినవి 8 ఫిర్యాదులు ఉన్నాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 73 ఫిర్యాదులు వచ్చాయి. అలాగే, ఎంఎంసీ (MMC)లో కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలు, ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొని, ప్రజలు వినిపించిన సమస్యలను పరిశీలించి తగిన చర్యలపై చర్చించారు.

Next Story