- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలకు అంబానీ రూ.10 కోట్ల విరాళం
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్ ఆలయం, కేదార్‌నాథ్ ఆలయంలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఆదివారం సందర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్ ఆలయం, కేదార్‌నాథ్ ఆలయంలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఆదివారం సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో బద్రీనాథ్‌కు చేరుకున్న ఆయన శ్రీ బద్రీ విశాల్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేదార్‌నాథ్‌కు వెళ్లి జలాభిషేకం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు ఆలయాల అభివృద్ధి, యాత్రికుల సౌకర్యాల కోసం బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీకి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. భక్తులు ‘జై శ్రీరామ్’ నినాదాలతో ఆయనకు స్వాగతం పలికారు.
ఇదిలా ఉండగా, కొనసాగుతున్న ఛార్‌ధామ్ యాత్రలో ఇప్పటివరకు 37 లక్షల మందికిపైగా భక్తులు నాలుగు ధామ్‌లను దర్శించుకున్నారు. వీరిలో కేదార్‌నాథ్‌ను 12 లక్షలకుపైగా, బద్రీనాథ్‌ను 10 లక్షలకుపైగా భక్తులు సందర్శించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఛార్‌ధామ్, హేమకుండ్ సాహిబ్ మార్గాల్లో మొత్తం 196 మంది యాత్రికులు మృతి చెందినట్లు అధికారుల సమాచారం. ఇందులో అధిక శాతం మరణాలు గుండె సంబంధిత సమస్యలు, ఎత్తైన ప్రాంతాల ప్రభావం వల్ల జరిగినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.






