- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచం మెచ్చిన నేత ప్రధాని మోడీ
ప్రపంచం మెచ్చిన నేత ప్రధాని మోడీ అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

దిశ, సిద్దిపేట అర్బన్ : ప్రపంచం మెచ్చిన నేత ప్రధాని మోడీ అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం సిద్దిపేట ఎన్జీవో భవన్లో ఏర్పాటుచేసిన మేధావుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిందని, భారత ప్రజాస్వామ్యానికి ప్రపంచ గుర్తింపు వచ్చిందని స్పష్టం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో సుపరిపాలన అందిందని, దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ వెంటే ఉన్నారని, నాల్గవసారి కూడా మోడీ ప్రధాని అవుతారని ధీమా చేశారు.మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని, అంత్యోదయ లక్ష్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్రం అందించిందని ఆయన ప్రశంసించారు.జాతీయ రహదారుల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నాయన్నారు. జన్ ధన్ ఖాతాల ద్వారా కోట్ల మంది సామాన్యులను ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం చారిత్రాత్మక పాత్ర పోషించిందని కొనియాడారు. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి మరియు ఈ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వమే కారణమని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. మోదీ విధానాలు మరియు తీసుకువచ్చిన డిజిటల్ ఇండియా చొరవ వల్లే దేశంలో నగదు రహిత లావాదేవీలు భారీగా పెరిగాయని పేర్కొన్నారు.దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే 4వ స్థానానికి చేర్చడానికి మోదీ కృషి చేస్తున్నారని వెల్లడించారు. కరోనా కష్టకాలం నుంచి పేదలకు ఉచిత బియ్యం అందిస్తున్న ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీదేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద సుమారు 81 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేసిందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు బాసంగారి వెంకన్న, నాయకులు అంబటి బాలేష్ తదితరులు పాల్గొన్నారు.






