- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ భూభాగం కాదు.. అదో జీవన విధానం: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
భారతదేశం అంటే కేవలం నిర్దిష్ట సరిహద్దులున్న భూభాగం కాదని, అదొక ఉన్నతమైన జీవన విధానమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తరాలు మారుతున్నా, ముందుకు సాగుతున్నా భారతీయులు ఒకే మార్గంలో పయనిస్తున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) అన్నారు. ఇవాళ ఢిల్లీలో ప్రతిష్ఠాత్మక బీఎంఎల్ ముంజాల్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం అనేది కేవలం ఒక నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులు కలిగిన భూభాగం మాత్రమే కాదన్నారు. అది ఒక ఉన్నతమైన మార్గం.. ఓ విశిష్టమైన జీవన విధామని పేర్కొన్నారు. దేశం అంతర్గత స్వభావం, సంస్కృతి ఎలా రూపాంతరం చెందాయో తెలుసుకున్నప్పుడే భారతదేశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం సాధ్యమవుతుందని మోహన్ భాగవత్ అన్నారు.
జంతువులకు, మనుషులకు తేడా ‘ధర్మమే’..
మానవులకు, జంతువులకు ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహారం, నిద్ర, భయం, పునరుత్పత్తి వంటి ప్రాథమిక అవసరాలు జంతువులకు, మనుషులకు సమానంగా ఉంటాయని అన్నారు. అయితే, మనుషులను జంతువుల నుంచి వేరు చేసేది కేవలం ధర్మం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. భౌతిక అవసరాల పరంగా మనం జంతువులతో సమానమైనప్పటికీ, మనుషులకు ఆలోచించే శక్తి, వివేచన (Reasoning) భగవంతుడిచ్చిన గొప్ప వరాలని మోహన్ భాగవత్ అన్నారు.






