- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్లాబులు తొలగించండి: హైడ్రా కమిషనర్ ఆదేశం
కాలువలపైన వేసిన స్లాబులే వరదకు కారణమని హైడ్రా గుర్తించింది. కనీసం డీ సిల్టింగ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేయడంతో సమస్యల తీవ్రత పెరుగుతోంది. కొండాపూర్‌లోని జూబ్లీగార్డెన్, శంషాబాద్, అత్తాపూర్, రామ్‌దేవ్‌బాబానగర్ ప్రాంతాల్లో వరద ముప్పునకు నాలాల్లో పేరుకుపోయిన పూడికే ప్రధాన కారణంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయి పర్యటనలో తెలింది....

దిశ, తెలంగాణ బ్యూరో: కాలువలపైన వేసిన స్లాబులే వరదకు కారణమని హైడ్రా గుర్తించింది. కనీసం డీ సిల్టింగ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేయడంతో సమస్యల తీవ్రత పెరుగుతోంది. కొండాపూర్‌లోని జూబ్లీగార్డెన్, శంషాబాద్, అత్తాపూర్, రామ్‌దేవ్‌బాబానగర్ ప్రాంతాల్లో వరద ముప్పునకు నాలాల్లో పేరుకుపోయిన పూడికే ప్రధాన కారణంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయి పర్యటనలో తెలింది. ప్రతి 3 మీటర్లకు వరద కాలువలను ఓపెన్ చేసే వ్యవస్థ ఉంటే.. డీసిల్టింగ్ పనులు పూర్తి స్థాయిలో జరిగేవని స్థానిక అధికారులు చెప్పారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ డి. జోయెల్ డేవిస్‌తో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు కమిషనర్ పర్యటనలో ఉన్నారు. వందల మీటర్ల కొద్దీ స్లాబ్‌లు తెరవడానికి కూడా వీలు లేకుండా మూసేయడంతో లోతట్టు ప్రాంతాలలో పెద్దమొత్తంలో చెత్త పేరుకుపోయి వరద ప్రవాహనాకి ఆటంకాలు ఏర్పడ్డాయనేది క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు నిర్ధారించారు. బొటానికల్ గార్డెన్స్, శ్రీ రాంనగర్, కొండాపూర్ పోలీసు బెటాలియన్ నుంచి భారీగా వచ్చిన వరద మీనాక్షి టవర్స్‌కు చేరువలో ఉన్న మొండి కుంటకు చేరాలి. మొండికుంట నిండిన తర్వాత ఔటెలెట్ ద్వార ముల్లకత్వా చెరువులోకి వెళ్లాల్సిన వరద కాలువలు పూర్తిగా పూడుకుపోవడంతో జూబ్లీ గార్డెన్స్ ను వరద ముంచెత్తిందని చెప్పారు.
స్లాబులు తొలగించి పూడికతీత..
శనివారం నుంచే జూబ్లీగార్డెన్స్ ప్రాంతంలో నాలాలపై స్లాబులు తొలగించి పూడికను పెద్దయెత్తున హైడ్రా తొలగిస్తోంది. పక్కనే మీనాక్షి అపార్టుమెంట్స్ ఆవరణ నుంచి 2.15 మీటర్ల వైసాల్యంలో వెళ్లాల్సిన వరద కాలువ మీటరున్నరకు కుంచించుకుపోవడమే కాకుండా.. పైపులైను వేయడంతో వరద పోటెత్తుతోందని అధికారులు గుర్తించారు. అలాగే వరద కాలువను నేరుగా మొండికుంట చెరువులోకి వదిలేయకుండా.. మురుగు నీరును డైవర్ట్ చేసేందుకు ఉద్దేశించి చేపట్టిన కాలువల అనుసంధానంలో ఉన్న లోపాలు కూడా వరద పోటెత్తడానికి కారణమైంది. ఈ సమస్యలను ఒకదాని తర్వాత ఒకటి పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నాలాలపై అవసరమైన మేరకు స్లాబులు తొలగించి పూర్తిగా డీసిల్టింగ్ పనులు చేపట్టాలని ఆదేశించారు. డీ సిల్టింగ్ పనులు అయిన తర్వాత ఓపె న్ నాలాలను గ్రిల్స్‌తో మూసేయాలని సూచించారు. ప్రతి 3 మీటర్లకూ తెరచే విధంగా ఈ ఏర్పాట్లుండాలన్నారు.
శంషాబాద్, అత్తాపూర్‌లోనూ అదే పరిస్థితి..
కొండాపూర్ జూబ్లీగార్డన్స్‌లోని పరిస్థితే శంషాబాద్, రాందేవ్‌బాబానగర్,అత్తాపూర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అవ్వడానికి ప్రధాన కారణమని అధికారులు నిర్ధారించారు. రాందేవ్‌బాబానగర్ వద్ద ఊరకుంటకు వెళ్లాల్సిన వరద నీరు ఇన్‌లెట్లు సరిగా లేకపోవడంతో శంషాభాద్ విమానాశ్రయం రోడ్డులో నీరు నిలిచిపోవడానికి గల కారణమని స్థానిక అధికారులు చెప్పారు. పీవీనరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబరు 265 వద్ద కూడా మీరాలం చెరువులోకి వెళ్లాల్సిన ఇన్‌లెట్లు పూడుకుపోవడంతో సమస్య తలెత్తుతోందని పేర్కొన్నారు. ఇక పిల్లర్ నంబరు 191 వద్ద మూసీలోకి వెళ్లాల్సిన వరద కాలువలు కూడా సరిగాలేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. ఈ మూడు ప్రాంతాల్లో వరద నిలవడానికి వీలు లేదని.. నాలాలు పూడుకు పోతే వెంటనే స్లాబులు తొలగించి.. పనులు చేపట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా అసెట్ విభాగం ఇన్‌స్పెక్టర్లతో పాటు.. ఆ ప్రాంతాలను పర్యవేక్షిస్తున్న ఎస్‌వోలను ఆదేశించారు. వారం రోజుల్లో మళ్లీ ఈ ప్రాంతాలను పరిశీలిస్తానని.. అప్పటికి శాశ్వత పరిష్కారం చూపిపంచాలని సూచించారు. ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ట్రాఫిక్ పోలీసు విభాగాలు సంయుక్తంగా పని చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.






