తెలంగాణకు జాతీయ అవార్డు.. గోవాలో ప్రదానం చేసిన కేంద్రమంత్రి

by Vemula.Srinu Prasad |

పర్యావరణ వ్యవస్థ ఆధారిత విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు గాను తెలంగాణ ప్రభుత్వానికి "ది ఇంక్లూసివ్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఎకోసిస్టమ్ డెవలప్‌మెంట్" జాతీయ అవార్డు లభించింది. కేంద్ర రెన్యువబుల్ ఎనర్జీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చేతుల మీదుగా రాష్ట్ర అధికారులు ఈ అవార్డును ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, టీజీరెడ్కో ఎండీ వి. అనిల అందుకున్నారు. ...

తెలంగాణకు జాతీయ అవార్డు.. గోవాలో ప్రదానం చేసిన కేంద్రమంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యావరణ వ్యవస్థ ఆధారిత విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు గాను తెలంగాణ ప్రభుత్వానికి "ది ఇంక్లూసివ్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఎకోసిస్టమ్ డెవలప్‌మెంట్" జాతీయ అవార్డు లభించింది. కేంద్ర రెన్యువబుల్ ఎనర్జీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చేతుల మీదుగా రాష్ట్ర అధికారులు ఈ అవార్డును ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, టీజీరెడ్కో ఎండీ వి. అనిల అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ యశో నాయక్, ఎంఎన్ఆర్‌ఈ కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సోమవారం గోవాలోని ఐటీసీ గ్రాండ్‌లో కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) "విండ్ ఎనర్జీ... ఫ్రమ్ అంబిషన్ టు యాక్సిలరేషన్" అనే నినాదంతో నిర్వహించిన గ్లోబల్ విండ్ డే-2026 జాతీయ సదస్సులో తెలంగాణకు ఈ అవార్డు వరించింది.

తెలంగాణ విండ్ పవర్‌కు అనుకూలం...

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ (ఎన్ఐడబ్ల్యూఈ) అంచనాల ప్రకారం.. తెలంగాణలో పవన విద్యుత్ ఉత్పత్తికి అపారమైన అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 100 మీటర్ల హబ్ ఎత్తులో 4,240 మెగావాట్లు, 120 మీటర్ల ఎత్తులో 24,835 మెగావాట్లు, 150 మీటర్ల హబ్ ఎత్తులో ఏకంగా 54,717 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నట్లు నిపుణులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలైన నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్‌లలో అత్యధిక గాలి సాంద్రత ఉన్న ప్రాంతాలుగా గుర్తించారు. భవిష్యత్తు అవసరాల కోసం డేటాను సేకరించేందుకు టీజీరెడ్కో, ప్రైవేట్ డెవలపర్లు కలిసి ఈ జిల్లాల్లో మొత్తం 164 విండ్ మానిటరింగ్ మాస్ట్‌లను (గాలిని కొలిచే స్తంభాలు) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 128.8 మెగావాట్ల సామర్థ్యం గల పవన విద్యుత్ ప్లాంట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన అపారమైన అవకాశాలను వాడుకోవడానికి పారదర్శకమైన టారిఫ్ విధానం, భూ కేటాయింపులు మరియు అవసరమైన మౌలిక సదుపాయాలతో ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు ఈ సదస్సులో వెల్లడించారు.

Next Story