ముంపు ముప్పు పై అలర్ట్.. రంగంలోకి డీసీపీ అనురాధ

by Batti.Sumithra |

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వాటర్‌లాగింగ్ ప్రాంతాలను ఎల్‌బీ నగర్ డీసీపీ అనురాధ సోమవారం పరిశీలించారు.

ముంపు ముప్పు పై అలర్ట్.. రంగంలోకి డీసీపీ అనురాధ
X

దిశ, వనస్థలిపురం : వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వాటర్‌లాగింగ్ ప్రాంతాలను ఎల్‌బీ నగర్ డీసీపీ అనురాధ సోమవారం పరిశీలించారు. జీఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్ పరిసర ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వర్షపు నీరు నిల్వ ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని డీసీపీ ఆదేశించారు. ఆమె వెంట వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ నవీన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం ఎస్‌హెచ్‌ఓ రవిబాబు, పోలీసు మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story