SSC GD కానిస్టేబుల్ ఆన్సర్ కీ విడుదల.. అభ్యంతరాలకు జూన్ 20 వరకు గడువు

by Kema Shiva Kumar |

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 25,487 జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసింది.

SSC GD కానిస్టేబుల్ ఆన్సర్ కీ విడుదల.. అభ్యంతరాలకు జూన్ 20 వరకు గడువు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించిన కానిస్టేబుల్ (GD)-2026 పరీక్షల ప్రాథమిక కీ (Provisional Answer Key) ఇవాళ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లతో పాటు ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, మొత్తం 25,487 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నియామక ప్రక్రియ జరుగుతోంది. ఈ పోస్టుల కొరకు ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి మే 30 వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో సీబీటీ విధానంలో పరీక్షలను నిర్వహించారు. పరీక్ష ముగిసిన నేపథ్యంలో అభ్యర్థుల మార్కులపై ఓ అంచనాకు రావడానికి వీలుగా కమిషన్ అన్సర్ కీని విడుదల చేసింది. ప్రాథమిక కీలో ఏవైనా తప్పులు ఉన్నట్లైతే.. వాటిపై అభ్యంతరాలు (Objections) వ్యక్తం చేసేందుకు SSC అవకాశం కల్పించింది. ఈ మేరకు జూన్ 15 నుంచి జూన్ 20 వరకు వరకు అభ్యర్థుల నుంచి నిర్ణీత రుసుముతో అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఆన్సర్ కీ లింక్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/ను సందర్శించాలని అధికారులు సూచించారు.

Next Story