ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు..

by Kodari Anjali |

ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మంత్రి అడ్లూరి అన్నారు.

ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు..
X

దిశ, ధర్మపురి: ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం ఆర్టిసి కరీంనగర్ ఈడీ సాల్మన్ కరీంనగర్ ఆర్ ఎం రాజు, జగిత్యాల డిపో మేనేజర్ తో కలిసి ధర్మపురి బస్టాండ్ ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ... ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే నియోజకవర్గానికి ఐటిఐ తో పాటు డిగ్రీ కళాశాల మంజూరు చేయించామని త్వరలోనే బస్సు డిపో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిధులు ఇవ్వడానికి అంగీకరించారని సంతోషం వ్యక్తం చేశారు. ధర్మపురి నుండి నిత్యం 4వేల నుంచి 5వేల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారని మంత్రి తెలిపారు.

ధర్మపురి నుండి ప్రత్యేక బస్సుకు హామీ..

ప్రత్యేక నిధులతో బస్టాండ్ లో రెండు కొత్త ప్లాట్ ఫాంలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు రానున్న రోజుల్లో భక్తుల సౌకర్యాల కొరకు తాగునీటి తో పాటు శానిటేషన్ పనులు చేయిస్తామన్నారు. ధర్మపురి నుండి వివిధ గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా కొత్తగా 13 రూట్లలో బస్సులు నడిపేందుకు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కరీంనగర్ నుండి రాత్రి 8 గంటలకు ప్రత్యేక బస్సు ధర్మపురి వరకు వస్తుందని ఇది చాలామంది ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఉదయం 8 గంటలకు ధర్మపురి నుండి ప్రత్యేక బస్సు కరీంనగర్ కు నడిపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ధర్మపురి నియోజకవర్గంలో ప్రయాణికులు బస్సుల కొరకు వేచి చూడకుండా T-shirt సేవలు అందజేస్తామని బస్టాండ్ లో ప్రయాణికులతో మాట్లాడుతూ భరోసా ఇచ్చారు

Next Story