పేకాట ఆడుతున్న ముఠా అరెస్ట్..

by Kodari Anjali |

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.

పేకాట ఆడుతున్న ముఠా అరెస్ట్..
X

దిశ, కరీంనగర్ రూరల్: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. చేగుర్తి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని సమాచారం తెలుసుకొని రూరల్ పోలీసులు సంయుక్తంగా అక్కడికి వెళ్ళగా.. అచ్చట చెట్ల పొదల్లో ఏడుగురు వ్యక్తులు మూడు ముక్కల పేకాట ఆడుతుండగా వారిని పట్టుకొని విచారించగా వారి యొక్క వివరములు సుల్తానాబాద్ మండలం నారాయణరావు పల్లెకు చెందిన కొమ్ము మల్లేశం, గొట్టం శ్రీనివాస్ కరీంనగర్ మండలం చేగుర్తి గ్రామానికి చెందిన కూకట్ల లక్ష్మణ్, మూల వెంకటేష్, పొన్నం రవి మరియు గుంటూరుపల్లికి చెందిన బజ్జీల శ్రీనివాస్ మరియు వారి వద్ద నుండి 18 వేల రూపాయల 100 రూపాయలు నగదు, మూడు మొబైల్ ఫోన్లను మరియు రెండు మోటార్ సైకిల్ లను స్వాధీన పరచుకొని కేసు నమోదు చేసి కోర్టులో పరచనట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు .

Next Story