- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి అవతార్ 3 వచ్చేస్తున్నది.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

X
దిశ, సినిమా: జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతకావ్యం ‘అవతార్’. ఈ విజువల్ వండర్ నుంచి వచ్చిన రెండు భాగాలు అత్యధిక ప్రేక్షకాదరణను పొంది రూ.కోట్లల్లో వసూలు రాబట్టాయి. దీంతో మూడో భాగం ‘అవతార్ - ఫైర్ అండ్ యాష్’ను కూడా గతేడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఆడియన్స్‌ను మరో లోకంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ ధరకు సొంతం చేసుకోగా.. ఈ నెల 24 నుంచి తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.
Next Story






