- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాహ్నవిని చివరిసారి చూసింది ఇతనే.. ఆ వృద్ధ దంపతులు ఎక్కడికి తీసుకెళ్లారో...?
తూర్పుగోదావరి జిల్లా తునిలో చిన్నారి జాహ్నవి అదృశ్యం అయిన విషయం తెలిసిందే. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే యూట్యూబ్‌లో వచ్చిన పోస్టు మాత్రం చిన్నారి మిస్సింగ్ మిస్టరీని మలుపు తిప్పింది. ..

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) తుని(Tuni)లో చిన్నారి జాహ్నవి అదృశ్యం అయిన విషయం తెలిసిందే. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఓ యూట్యూబ్ చానల్‌లో వచ్చిన పోస్టు మాత్రం చిన్నారి మిస్సింగ్ మిస్టరీని మలుపు తిప్పింది. చిన్నారిని వృద్ధదంపతులు తీసుకెళ్లుండగా తాను రాజమండ్రిలో చూశానని ఓ యూట్యూబ్ చానల్ మెసేస్ బాక్సులో జీసెస్ అనే పేరుతో గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్ చేశారు. దీన్ని ఓ యువతి గమనించి వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మెసేజ్ ఆధారంగా చిన్నారి ఆచూకీ గుర్తించవచ్చని ఆమె అన్నారు. ముందుగా ఆ వ్యక్తి అకౌంట్‌ను గుర్తిస్తే అతనెవరో తెలుసుకోవచ్చని తెలిపారు. అతను చెప్పిన విధంగా సీసీ ఫుటేజులను పరిశీలిస్తే చిన్నారి జాహ్నవిని తీసుకెళ్లిన వ్యక్తులను గుర్తించవచ్చని ఆ యువతి తెలిపారు. ‘‘చిన్నారి జాహ్నవిని ఎక్కడ చూశారు.. ఏ బస్సులో తీసుకెళ్లారు. వాళ్లు ఎవరు..?’ అనే విషయాలు బయటకు వస్తాయని ఆ యువతి పేర్కొన్నారు. అయితే ఆ మెసేజ్‌ను తన సోదరి యూట్యూబ్ ఛానల్‌లో చూసిందని, తనకు చెప్పడంతో ఈ విషయాన్ని తాను వెలుగులోకి తీసుకొచ్చానని యువతి తెలిపారు. ఇప్పటికైనా చిన్నారి జాహ్నవి దొరకాలని ఆమె కోరుకున్నారు.






