టీజీ పాలిసెట్: రెండు రోజులు వెబ్ ఆప్షన్ల నమోదు

by Vemula.Srinu Prasad |

టీజీ పాలిసెట్ చివరి విడత ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, టీజీపాలిసెట్-2026 ప్రవేశాల కన్వీనర్ ఎ.శ్రీదేవసేన తెలిపారు. ...

టీజీ పాలిసెట్: రెండు రోజులు వెబ్ ఆప్షన్ల నమోదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీ పాలిసెట్ చివరి విడత ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, టీజీపాలిసెట్-2026 ప్రవేశాల కన్వీనర్ ఎ.శ్రీదేవసేన తెలిపారు. మంగళవారం సర్టిఫికేట్ వెరిఫికేషన్, జూన్ 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు, జూన్ 20 లేదా అంతకంటే ముందుగా సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, హెల్ప్ లైన్ కేంద్రాల జాబితా, అందుబాటులో ఉన్న కోర్సుల వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgpolycet.nic.inను సందర్శించాలని కన్వీనర్ సూచించారు.

Next Story