- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయాలు సరస్వతి శిశు మందిరాలు
భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలకు నిలయాలుగా సరస్వతి శిశు మందిరాలు నిలుస్తాయని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

దిశ, రాజేంద్రనగర్ : భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలకు నిలయాలుగా సరస్వతి శిశు మందిరాలు నిలుస్తాయని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం కాటేదాన్ డివిజన్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి లో నూతనంగా నిర్మించిన శిశు మందిర్ ప్లే స్కూల్ ను రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డితో కలిసి విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...సమాజంలో శిశు మందిరం పాఠశాలలు ఎక్కడ ఉన్నా అందరూ ఆదరించాలని, వాటి అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.శిశు మందిరం పాఠశాలల్లో విద్యార్థులకు దేశభక్తి మిళితం చేసిన విద్యాబోధన అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి శ్రీనివాస్, నవారు మురళీధర్ రెడ్డి, భూషణం, డాక్టర్ భార్గవ్ అక్కేమ్ కృష్ణ యాదవ్, స్కూల్ హెడ్ మాస్టర్ సరస్వతి, నాగరాజు, సుభాష్, పాండు యాదవ్ రావుల భాస్కర్, సంతు గౌడ్, అడికె జనార్ధన్, మన్మోహన్ రెడ్డి, బల్ల శ్రీనివాస్ యాదవ్, శిశు మందిర్ ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.






