- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈనెల 25 నుంచి రాష్ట్రంలో SIR షురూ.. సీఈవో సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఇంటింటి సర్వే జరగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వే చేపట్టనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) ప్రకటించారు. ఈ క్రమంలోనే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15 నుంచి 24 వరకు మొత్తం మూడు దశలుగా కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా SIR సర్వేను ఎలా నిర్వహించాలి.. ఏ అధికారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి.. బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు పని విభజనపై జిల్లా ఎన్నికల అధికారుల నేతృత్వంలో పక్కా ప్లాన్ తయారుచేయనున్నారు.
ఇక సెకండ్ ఫేజ్‌లో SIR సర్వేలో డీఈవో, ఈఆర్వోలతో పాటు 867 మంది ఏఈఆర్వోలు, 3,596 మంది బీఎల్‌వో పర్యవేక్షకులు, 35,985 మంది బీఎల్‌వో (BLO's)లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అనంతరం ఇంటింటికీ బీఎల్‌వోలు ఎన్నిసార్లు వెళ్లాలి.. ఎన్యుమరేషన్ పత్రాల సమర్పణ, స్వీకరణ.. ఫారం-6, ఫారం-7, ఫారం-8 తదితర అంశాలపై సిబ్బందిని ట్రైన్ చేయనున్నారు. చివరగా ఓటర్ల ఎన్యుమరేషన్ వివరాలు ఆన్‌లైన్‌ఓ ఎలా ఎంట్రీ చేయాలో సిబ్బందికి పవర్ పాయంట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా వివరించనున్నారు. చివరి మూడో ఫేజ్‌లో సర్వేలో భాగంగా ఇంటింటికి అందించే ఎన్యుమరేషన్ పత్రాలను ముద్రించనున్నారు. ఓటరు గుర్తింపు సంఖ్య, పాత ఫొటో, క్యూఆర్ కోడ్, చవరి SIRకు సంబంధించిన డీటెయిల్స్, ఓటరుకు సంబంధించిన ఇతర సమాచారంతో ఫుల్ డీటెయిల్స్ ప్రింట్ కాపీలు బీఎల్‌వోలకు అందజేస్తారు.
డోర్ టు డోర్ సర్వే..
ఈ నెల 25 నుంచి జులై 24 వరకు ప్రతి గ్రామంలోని బీఎల్‌వోలు SIR సర్వేను గడపగడపకు నిర్వహించనున్నారు. జులై 31న ఓటర్ డ్రాఫ్ట్ జాబితాను ప్రదర్శించి.. జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరిస్తారు. ఏమైనా సందేహాలు ఉన్న ఓటర్లకు నోటీసులు ఇచ్చి పున: పరిశీలన చేపట్టి సరిచేస్తారు. చివరగా అక్టోబరు 1న ఓటరు తుది జాబితాను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించనున్నారు.






