- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ వైర్లు తాకి ఇంటర్ విద్యార్థి మృతి
మియాపూర్‌లో విద్యుత్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.

దిశ, శేరిలింగంపల్లి : మియాపూర్‌లో విద్యుత్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌కు చెందిన జాదవ్ రాజు మదీనాగూడలో చెరకు రసం బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రి బయటకు వెళ్లడంతో చెరకు రసం బండి వద్దకు వచ్చిన కుమారుడు మహేష్ జాదవ్ (18) అగరుబత్తి వెలిగించేందుకు అగ్గిపెట్టె కోసం పక్కనే ఉన్న షవర్మా దుకాణం వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో కింద ఉన్న విద్యుత్ వైర్లు పైకి తేలి ఉండగా, వాటిని గమనించకుండా మహేష్ జాదవ్ వాటి పై కాలు పెట్టాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. విద్యుత్ వైర్లు బయటకు తేలి ఉండటం, వర్షం కారణంగా కరెంట్ సరఫరా కొనసాగుతుండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్ తెలిపారు. ఇంటర్‌లో 950 మార్కులు సాధించిన మహేష్ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాల్సిన యువకుడు. తండ్రికి అండగా నిలవాలనే ఉద్దేశంతో చెరకు రసం బండి వద్దకు వచ్చిన మహేష్ జాదవ్ దుర్మరణం పాలయ్యాడు. పూజ చేసేందుకు అగ్గిపెట్టె కోసం వెతుకుతూ ప్రాణాలు కోల్పోవడం స్థానికులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.






