వామ్మో.. ఇదేం పిచ్చి సాహసం బాబోయ్.. పామును బెల్టులా చుట్టి కెమెరాకు ఫోజులు!

by Gantepaka Srikanth |

సాధారణంగా ఎదురుగా పాము కనిపిస్తేనే ఎవరైనా సరే గుండె జారినంత పని అవుతుంది.. అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తారు.

వామ్మో.. ఇదేం పిచ్చి సాహసం బాబోయ్.. పామును బెల్టులా చుట్టి కెమెరాకు ఫోజులు!
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఎదురుగా పాము కనిపిస్తేనే ఎవరైనా సరే గుండె జారినంత పని అవుతుంది.. అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తారు. విషసర్పం కాకపోయినా సరే, ఆ రూపం చూస్తేనే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. కానీ, ఓ వ్యక్తి మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేశాడు. ప్యాంట్ జారిపోకుండా ఉండేందుకు ఏకంగా బతికున్న పామునే నడుముకు బెల్టులా చుట్టుకున్నాడు. నమ్మశక్యం కాని ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి తన ప్యాంటు బెల్ట్ లేకపోవడంతో, ఏమాత్రం భయం లేకుండా ఒక పామును తీసుకుని నడుము చుట్టూ తిప్పి బెల్టులా బిగించుకున్నాడు. అంతటితో ఆగకుండా, ఆ పాము నడుముకు చుట్టుకుని ఉండగానే కెమెరా వైపు చూస్తూ వింత వింత ఫోజులిచ్చాడు. ఆ వ్యక్తి ప్రవర్తన, ముఖంలో ఎలాంటి భయం లేకపోవడం చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేం పిచ్చి సాహసం బాబోయ్ అంటూ నెటిజన్లు షాకు గురవుతున్నారు.

రీల్స్ పిచ్చిపై నెటిజన్ల ఆగ్రహం..

ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నప్పటికీ, నెటిజన్ల నుంచి మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం వ్యూస్ కోసం, లైకుల కోసం, సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఇలాంటి ప్రాణాంతకమైన స్టంట్లు చేయడం ఏంటని మండిపడుతున్నారు. "ఇలాంటి పిచ్చి పనులు ప్రాణాల మీదకు తెస్తాయి. దయచేసి ఎవరూ వీటిని ప్రయత్నించకండి" అని ఒకరు కామెంట్ చేయేగా.. "వ్యూస్ కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇది వన్యప్రాణులను హింసించడమే అవుతుంది" అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రేజీ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతమైన వ్యూస్తో దూసుకుపోతోంది.

Next Story