కడపలో బైక్ స్టంట్స్, రేసింగులు.. ఎమ్మెల్యే ఉక్కుపాదం..!

by Vemula.Srinu Prasad |

కడపలో కొందరు మైనర్ యువకులు రెచ్చిపోతున్నారు. రోడ్లపైకి వచ్చి బైక్ స్టంట్స్, రేసింగ్‌లతో బీభత్సం సృష్టిస్తున్నారు. సోషల్ మీడియా రీల్స్, వ్యూస్ కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ....

కడపలో బైక్ స్టంట్స్, రేసింగులు.. ఎమ్మెల్యే ఉక్కుపాదం..!
X

దిశ, వెబ్ డెస్క్: కడప(Kadapa)లో కొందరు మైనర్ యువకులు(Minor youths) రెచ్చిపోతున్నారు. రోడ్లపైకి వచ్చి బైక్ స్టంట్స్(Bike stunts), రేసింగ్‌ల(Racing events)తో బీభత్సం సృష్టిస్తున్నారు. సోషల్ మీడియా రీల్స్, వ్యూస్ కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నెంబర్ ప్లేట్లు లేకుండా బైకులు నడుపుతూ యదేచ్ఛగా, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు భయాందోళనలకు గురవతున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్టంట్స్‌పై ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి సీరియస్

అయితే కడపలో ఈ స్టంట్స్‌పై ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి(MLA Reddappagari Madhavi) సీరియస్ అయ్యారు. మైనర్ యువకులు బైక్ స్టంట్స్, రేసింగ్‌లకు పాల్పడటం చట్టాన్ని ధిక్కరించడమేనని ఆమె మండిపడ్డారు. ఇలాంటి వాటిని చిన్నవిగా చూడకూడదన్నారు. పోలీస్ యాంత్రంగం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. స్టంట్స్‌కు పాల్పడుతున్న వారి పట్ల కఠినంగా ఉండాలన్నారు. మైనర్లకు బైక్స్ ఇస్తున్న తల్లిదండ్రులను కూడా తప్పు బట్టాల్సి ఉంటుందన్నారు. కడపలో ఇలాంటివి పునరావృతం కాకుండా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పిలుపునిచ్చారు. చట్టాలను ఉల్లంఘించే వారిని అసలు వదిలిపెట్టొద్దని పోలీసులను ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ఆదేశించారు.

Next Story