- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమావాస్య ఎఫెక్ట్.. పాఠశాలల్లో తగ్గిన హాజరు శాతం
వేసవి సెలవుల అనంతరం సోమవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి.

దిశ, ఖమ్మం రూరల్ : వేసవి సెలవుల అనంతరం సోమవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కొత్త విద్యాసంవత్సరానికి శ్రీకారం చుడుతూ విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు చేరుకున్నారు. అయితే తొలిరోజు అమావాస్య ప్రభావంతో సాధారణం కంటే విద్యార్థుల హాజరు శాతం కొంత తగ్గినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ మండల పరిధిలోని పాఠశాలలను సందర్శించిన ఎంఈవో శ్రీనివాస్ నూతనంగా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తూరు (వై) పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్న నూతన చిన్నారులకు పూలమాలలు వేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చదువులో రాణించాలని ప్రోత్సహించారు. అలాగే పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎంఈవో పేర్కొన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాల ప్రాంగణాలు మళ్లీ విద్యార్థుల సందడితో కళకళలాడాయి.






