- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోస్ట్ వాంటెడ్ ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
నగరంలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మోస్ట్ వాంటెడ్ అంతర్ రాష్ట్ర దొంగను సోమవారం రాజేంద్రనగర్ లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, రాజేంద్రనగర్ : నగరంలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మోస్ట్ వాంటెడ్ అంతర్ రాష్ట్ర దొంగను సోమవారం రాజేంద్రనగర్ లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి శ్రీనివాస్ నిందితుడి వివరాలను వెల్లడించారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బైక్ చోరీలకు పాల్పడుతున్న కర్ణాటక రాష్ట్రం కూర్గ్ జిల్లాకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గోవిందప్ప కూడిగే అలియాస్ కట్టప్ప ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈనెల 9వ తేదీన బండ్లగూడ జాగిర్ లోని డాన్ బాస్కో స్కూల్ ముందు పార్క్ చేసిన వెంకటయ్య ద్విచక్ర వాహనాన్ని నిందితుడు చోరీ చేశాడు. వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఆదివారం ఆరాంఘర్ చౌరస్తాలో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న కట్టప్పను అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. పోలీసుల విచారణలో చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. నిందితుడు వివిధ ప్రాంతాలలో దొంగిలించిన వాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్ ఎసిపి తుల శ్రీనివాస్, సీఐ మత్తు యాదవ్, డిఐ నవీన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






