- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వచ్చే నెలలో ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగ.. ‘ఫౌజీ’ టీజర్‌పై కీలక అప్ డేట్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కలయికలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ పిరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కలయికలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ పిరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా.. తాజాగా ‘ఫౌజీ’ టీజర్‌తో పాటు, ట్రైలర్ అప్డేట్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుండగా.. ఇప్పుడు వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ మేరకు ఫిలిమ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఫౌజీ టీజర్ వచ్చే నెలలో అంటే జులై లాస్ట్ వీక్ లేదా, ఆగస్టు ఫస్ట్ వీక్‌లో తీసుకురాబోతున్నారట. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా వెంటనే స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుండగా.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.






