- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజావాణికి 55 ఫిర్యాదులుప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులలొ 32 శాతం పెండింగ్ లో ఉన్నాయని త్వరితగతిన వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

దిశ, గద్వాల కలెక్టరేట్: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులలొ 32 శాతం పెండింగ్ లో ఉన్నాయని త్వరితగతిన వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐడిఓసి సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ వారం ప్రజావాణికి మొత్తం 55 దరఖాస్తులు రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కి వచ్చిన ఫిర్యాదులను ఆన్ లైన్ లొ నమోదు చేయడం జరుగుతుందని సంబంధిత శాఖల అధికారులు సంబంధిత వెబ్ సైట్ నుంచి ఫిర్యాదులను తీసుకొని పరిష్కరించాల్సి ఉందన్నారు. సర్వే, రెవెన్యూ, హౌసింగ్, పంచాయతీరాజ్, మున్సిపల్, డిఆర్డిఏ, విద్యుత్ శాఖల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజావాణి ఆర్జీలు రావడం జరిగిందని, సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక..
పాఠశాలలు ప్రారంభమైనందున మండలాల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ విద్యాసంస్థలను సందర్శించి పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాలని, ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు అదనంగా కనీసం 20 శాతం ప్రవేశాలు జరిగేలా చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల చిన్నారులందరూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చేరేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయడం జరిగిందని పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్లాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
అత్యధికంగా ఆర్జీలు పెండింగ్ లో..
అంతకుముందు హైదరాబాదు నుంచి వచ్చిన ప్రజావాణి సమన్వయకర్త సహదేవ్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజావాణి దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించకుంటే సంబంధిత శాఖల నుంచి ఆర్జీలను కలెక్టర్, రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ప్రజావాణిపై జిల్లా నుంచి ముగ్గురు అధికారులకు శిక్షణ ఇచ్చారని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. రెవిన్యూ శాఖలో అత్యధికంగా ఆర్జీలు పెండింగ్ లో ఉన్నాయని, భూ సమస్యలను ఎలాంటి ఇబ్బందులు రాకుండా పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం ప్రజావాణిని రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నారని రాబోవు రోజుల్లో మండల స్థాయిలోనూ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






