అవుట్ సోర్సింగ్ విద్యుత్ కార్మికులకు మద్దతుగా బీజేపీ ధర్నా..

by Kodari Anjali |

అవుట్ సోర్సింగ్ విద్యత్ కార్మికులకు జీత బత్తాలు వెంటనే చెల్లించాలని అల్వాల్ సర్కిల్ బీజేపి నాయకులు డిమాండ్ చేశారు.

అవుట్ సోర్సింగ్ విద్యుత్ కార్మికులకు మద్దతుగా బీజేపీ ధర్నా..
X

దిశ, అల్వాల్: అవుట్ సోర్సింగ్ విద్యుత్ కార్మికులకు జీత బత్తాలు వెంటనే చెల్లించాలని అల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సర్కిల్ కార్యాలయం ముందు ధర్నా చేసి ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటింటికి విద్యుత్ సరఫరా చేస్తూ మన ఇండ్లలో వెలుగు నింపే కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు లేక అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. సంబంధిత కాంట్రాక్టర్‌చే సకాలంలో జీతాలు అందేలా జీహెచ్ఎంసీ అధికారులు తగిన చొరవ తీసుకొని కార్మికులకు జీతాలు అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కార్తీక్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, అజయ్ రెడ్డి, మాణిక్ రెడ్డి, రామ్మోహన్ గౌడ్, శ్రీనివాస్ వర్మ, దండుగుల వెంకటేశ్, మల్లికార్జున్ గౌడ్, మురళి కృష్ణ, అనిల్, ఉదయ్ ప్రకాష్ మొయ్యి సుజాత, పద్మనీ పాల్గొన్నారు.

Next Story