- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్ర వాహనాలు.. ముగ్గురికి గాయాలు
by Batti.Sumithra |
గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

X
దిశ, ములకలపల్లి: మండలంలోని పొగళ్లపల్లి గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆనందపురం గ్రామానికి చెందిన ఓ పాస్టర్ తన ద్విచక్ర వాహనం పై ములకలపల్లికి వస్తుండగా, గుండాలపాడు గ్రామానికి చెందిన ఇద్దరు మరో ద్విచక్ర వాహనం పై ములకలపల్లి నుంచి గుండాలపాడుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పొగళ్లపల్లి గ్రామ శివారులో రెండు వాహనాలు అదుపుతప్పి ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరు వాహనాల పై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను అంబులెన్స్‌లో భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన పై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Next Story






