- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోధుర్ హైస్కూల్‌లో దొంగల బీభత్సం.. నెలలు కావస్తున్న కేసు నమోదు చేయని పోలీసులు
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోధుర్ జిల్లా పరిషత్ పాఠశాలలో గుర్తు తెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు.

దిశ, ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోధుర్ జిల్లా పరిషత్ పాఠశాలలో గుర్తు తెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు. వేసవి సెలవులలో నేపథ్యంలో గత ఏప్రిల్ 18న పాఠశాలలోకి చొరబడిన దుండగులు సీసీ కెమెరాలను పగలగొట్టి, స్టాఫ్ రూములోని ఎంపిల్ వైరు, సీసీ కెమెరా మానిటర్, క్రికెట్ కిట్లు, వాలీబాల్ లు, మైక్ సెట్ మరికొన్ని ఆట వస్తువులు దొంగిలించారు. సమాచారం అందుకున్న ఎంఈవో మధు స్థానిక పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారణ చేయగా, వేసిన తాళం వేసినట్లే ఉంది. రూమ్‌లో పరికరాలు దొంగలించారని తెలుకుని పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ సూచించారే తప్ప ఇప్పటివరకు కేసు నమోదు చేయలేధు. తాజాగా నేడు తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు పునః ప్రారంభించగా పాఠశాలలో దొంగలు పడ్డారన్న విషయం విద్యార్థులు, వారి తల్లితండ్రులకు, గ్రామస్తులకు తెలియడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఘటన జరిగి నెలలు కావస్తున్న ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడంపై దొంగతనానికి పాల్పడింది ఎవరనేది అంతుచ్చిక్కకుండా పోయింది. పై విషయం ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్ ను వివరణ కోరగా దొంగతనం జరిగింది వాస్తావమేనని విచారణ జరుపుతున్నారే తప్ప! ఇంకా కేసు నమోదు చేయలేదని తెలిపారు.






