వీఓఏల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక చొరవ..

by Kodari Anjali |

ఐకెపి వీఓఏల సమస్యల పరిష్కారానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరోసారి తన ప్రత్యేక చొరవను చాటుకున్నారు.

వీఓఏల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక చొరవ..
X

దిశ, బల్మూర్: గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలులో కీలక భూమిక పోషిస్తున్న ఐకెపి వీఓఏల సమస్యల పరిష్కారానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరోసారి తన ప్రత్యేక చొరవను చాటుకున్నారు. అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన వీఓఏలతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ హైదరాబాద్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యలను వివరించారు. వేతనాలు, ఉద్యోగ భద్రత, సేవా నిబంధనలు తదితర అంశాలపై వీఓఏలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, తక్షణ పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం దృష్టికి వెళ్లినందుకు వీఓఏలు హర్షం..

సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి సీతక్క, సంబంధిత అధికారులతో చర్చించి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో వీఓఏలు వెన్నెముకలా పనిచేస్తున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వీఓఏల సంక్షేమం కోసం నా వంతు కృషి నిరంతరం కొనసాగుతుంది అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చొరవతో తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లినందుకు వీఓఏలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. వీఓఏల హక్కుల సాధనకు అండగా నిలుస్తూ... సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో కృషి చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు వీఓఏలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Next Story