- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్యాశ గెలిచింది... కృతజ్ఞత ఓడిపోయింది: హరీష్ రావు
ప్రజలకు అత్యాశ చూపి ఎన్నికల్లో గెలిచి ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు.

దిశ, చిన్నకోడూరు : ప్రజలకు అత్యాశ చూపి ఎన్నికల్లో గెలిచి ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. మండల పరిధిలోని శంకరయకుంట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాల వికాస్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అత్యాశకు కృతజ్ఞతకు మధ్య నలిగిపోయారన్నారు. రేవంత్ రెడ్డి చూపిన ఆశలో పడి ప్రజలు ఆయనను గెలిపిస్తే గద్దెనెక్కిన ప్రజలను నట్టేట ముంచాడన్నారు. 420 హామీలను ప్రజలకు ఇచ్చి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ప్రజలు రేవంత్ రెడ్డి చూపిన ఆశలో పడి....మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మోసం చేశామని ప్రజలు బాధపడుతున్నారు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతుల నుంచి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేశామన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ అని రైతులకు కనీసం 10 గంటలు కూడా ఇస్తలేరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పై అసంతృప్తితో ఉన్నారన్నారు. రైతు బీమా డబ్బులు బీమా సంస్థలకు నేటి వరకు చెల్లించలేదన్నారు. రైతులు ఎవరైనా మరణిస్తే రైతుకు ఐదు లక్షల ఆర్థిక సాయం అందించే పథకం మరుగున పడిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో కూడా రైతులకు రైతుబంధు అందించామన్నారు. నేటికీ రైతులకు రైతుబంధు పూర్తిస్థాయిలో అందించని ఘనత రేవంత్ రెడ్డి కే దక్కిందన్నారు. కాంగ్రెస్ అంటేనే కష్టాల పాలనని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడంలో, కష్టంలో కాంగ్రెస్ కు వెన్నతో నేర్పిన విద్య అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ సందర్భంగా 100 కుటుంబాలకు ఉచితంగా వాటర్ క్యాన్లను అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాకు మహేష్, బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణశర్మ, మాణిక్య రెడ్డి, శ్రీనివాస్, ఉమేష్ చంద్ర, వంశీ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






