మరో చాన్స్ దక్కించుకున్న కాజల్ అగర్వాల్.. లేడీ డాన్‌గా విశ్వరూపం చూపించేందుకు రెడీ!

by Mallepaka Hamsa |

సిరీస్‌లో కాజల్ అగర్వాల్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ లేడీ డాన్‌ పాత్రలో కనిపించబోతున్నారట.

మరో చాన్స్ దక్కించుకున్న కాజల్ అగర్వాల్.. లేడీ డాన్‌గా విశ్వరూపం చూపించేందుకు రెడీ!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సెకండ్స్ ఇన్నింగ్స్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. భారీ ప్రాజెక్ట్స్‌లో నటించే అవకాశం దక్కించుకుంటూ.. తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇప్పటికే ది ఇండియన్ స్టోరీ, రామాయణ, NBK-111 వంటి సినిమాల్లో నటిస్తున్న కాజల్ ఓటీటీలోనూ రాణించేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్. తాజాగా ఆమె ఒక వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, షూటింగ్‌ను కూడా పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘స్వామిరారా’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సిరీస్ రూపొందుతోంది. దీనికి ‘విశాఖ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో కాజల్ అగర్వాల్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ లేడీ డాన్‌ పాత్రలో కనిపించబోతున్నారట.

ఇందులో ఆమె చేసే యాక్షన్ సీన్స్ సిరీస్‌కే ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయని సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్‌లో సుస్మితా సేన్ ప్రధాన పాత్రలో నటించి సంచలన విజయం సాధించిన ‘ఆర్య’ వెబ్ సిరీస్‌కు అధికారిక తెలుగు రీమేక్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబం కోసం ఒక సాధారణ మహిళ ఎలాంటి పరిస్థితుల్లో అండర్‌వరల్డ్ లేడీ డాన్‌గా మారాల్సి వచ్చింది అనే ఆసక్తికరమైన కథాంశంతో ఇది సాగుతుందని టాక్. ఈ క్రేజీ వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సిరీస్‌ను జూలై లేదా ఆగస్ట్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Next Story