మానవత్వం రూపంలో కలెక్టర్... ఏళ్ల భూ సమస్యకు న్యాయం

by Taduka Kalyani |

జనగామ మండలం శామీర్పేట్ గ్రామానికి చెందిన రైతు బడుక రాంచందర్‌కు చెందిన 23 గుంటల భూమి అక్రమంగా ఇతరుల పేరుపై బదిలీ కావడంతో ఎన్నో సంవత్సరాలుగా ఆవేదన చెందుతున్నారు.

మానవత్వం రూపంలో కలెక్టర్... ఏళ్ల భూ సమస్యకు న్యాయం
X

దిశ, జనగామ: జనగామ మండలం శామీర్పేట్ గ్రామానికి చెందిన రైతు బడుక రాంచందర్‌కు చెందిన 23 గుంటల భూమి అక్రమంగా ఇతరుల పేరుపై బదిలీ కావడంతో ఎన్నో సంవత్సరాలుగా ఆవేదన చెందుతున్నారు. పలుమార్లు అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలిసి తన గోడును వినిపించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో విచారణ చేపట్టించి, భూ రికార్డులను పరిశీలించి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ తన భూమిని తిరిగి పొందిన రాంచందర్, "మా కుటుంబానికి ఊరట కలిగించిన కలెక్టర్ కి జీవితాంతం రుణపడి ఉంటాం" అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను వినడమే కాదు... పరిష్కారం చూపడంలోనూ ముందుండే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా... జనగామ ప్రజలకు మానవత్వం రూపంలో కనిపిస్తున్నారు.

Next Story