- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటి రష్మికకు తప్పిన ప్రమాదం.. కాపాడిన మరో హీరోయిన్
సినిమా ప్రమోషన్ కోసం పూణేలోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్‌కు వచ్చిన చిత్ర బృందానికి ఊహించని అనుభవం ఎదురైంది.

దిశ, వెబ్‌డెస్క్: సినిమా ప్రమోషన్ కోసం పూణేలోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్‌కు వచ్చిన చిత్ర బృందానికి ఊహించని అనుభవం ఎదురైంది. అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో తోపులాట జరగడంతో టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందన్న భయాందోళనకు గురైంది. అయితే, సహనటి కృతి సనన్ వెంటనే అప్రమత్తమై రష్మికను తన చేతులతో చుట్టేసి, రక్షణ కవచంలా నిలిచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే...?
షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం "కాక్టైల్-2 (Cocktail 2). ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ పూణేలోని ఒక షాపింగ్ మాల్‌లో మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. తమ అభిమాన నటీనటులను చూడటానికి వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా మాల్కు చేరుకున్నారు. మొదట అంతా సజావుగానే సాగింది. నటీనటులు అభిమానులతో కలిసి సరదాగా 'వడా పావ్' తింటూ సందడి చేశారు. కానీ, సెలబ్రిటీలు స్టేజ్ మీదికి రాగానే ఒక్కసారిగా క్రౌడ్ కంట్రోల్ తప్పింది. అభిమానులు సెక్యూరిటీ బారికేడ్లను బద్దలు కొట్టుకుని నటీనటుల వైపు దూసుకొచ్చారు. అభిమానుల తాకిడికి సెక్యూరిటీ సిబ్బంది సైతం ఏమీ చేయలేకపోయారు. తీవ్రమైన తోపులాట జరగడంతో రష్మిక ఒక్కసారిగా కంగారుపడిపోయింది. ఆ సమయంలో కృతి సనన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రష్మికను గట్టిగా పట్టుకుని, జనం ఆమెపై పడకుండా అడ్డుగా నిలబడింది. రష్మికను జాగ్రత్తగా గైడ్ చేస్తూ అక్కడి నుంచి సురక్షితంగా వెలుపలికి తీసుకువెళ్లింది. మరోవైపు హీరో షాహిద్ కేపూర్ సైతం ఈ గందరగోళం మధ్య తీవ్ర అసహనానికి లోనయ్యాడు. పరిస్థితి చేయి దాటిపోవడంతో నిర్వాహకులు ఈవెంట్‌ను మధ్యలోనే నిలిపివేసి, నటీనటులను అక్కడి నుంచి తరలించారు.
సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు..
కృతి సనన్ సమయస్ఫూర్తిని, రష్మిక పట్ల చూపించిన ప్రేమాభిమానాలను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అదే సమయంలో మాల్ యాజమాన్యం, నిర్వాహకుల సెక్యూరిటీ వైఫల్యంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ 'కాక్టైల్ 2 చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ముగ్గురి మధ్య సాగే లవ్ ట్రయాంగిల్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.






