- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మేకప్ మంత్రి’ వ్యాఖ్యల దుమారం: అమర్‌నాథ్ రియాక్షన్ ఇదే..!
హోంమంత్రి వంగలపూడి అనితను ‘మేకప్ మంత్రి’ అని మాజీ మంత్రి అమర్ నాథ్ విమర్శించడంపై టీడీపీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. హోంమంత్రి అనితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha)ను ‘మేకప్ మంత్రి’ అని మాజీ మంత్రి అమర్ నాథ్(Former Minsiter Amar Nath) విమర్శించడంపై టీడీపీ(Tdp) నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. మహిళా హోంమంత్రిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే అమర్ నాథ్ మాత్రం వెనక్కి తగ్గిదిలేదంటున్నారు.
కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకే అలా మాట్లాడా
విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై కేసులు పెట్టినా, అరెస్ట్ చేసి జైలుకు పంపినా మాత్రం తాను చేసి కామెంట్స్‌కు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికే మాట్లాడానని చెప్పారు. తాను మాట్లాడిన దానిలో ఏం తప్పులేదని ఆయన మద్దతిచ్చుకున్నారు. తాను చేసిన కామెంట్స్ కరెక్టేనా కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. ఏ కేసు పెట్టినా ఫేస్ చేసేందుకు తాను రెడీ అని మాజీ మంత్రి అమర్ నాథ్ స్పష్టం చేశారు. గతంలో జగన్, భారతిపై అనిత అనుచిత వ్యాఖ్యాలు చేశారని, ఇప్పటి వరకూ కూడా ఆ వ్యాఖ్యలకు క్షమాపలు చెప్పలేదని గుర్తు చేశారు. ఆ సమయంలో టీడీపీ అధినాయకత్వం వాళ్ల మాటలకు వత్తాసు పలికిందని అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు.






