- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర ఉల్లంఘన
శ్రీవారి ఆలయంపై హెలికాప్టర్ కలకలం సృష్టించింది. ఆనంద నిలయం మీదిగా హెలికాప్టర్ వెళ్లింది. శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి ఎలాంటి విమానాలు, హెలికాప్టర్లు వెళ్లకూడదనే నిబంధన ఉంది...

దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి ఆలయం(Srivari Temple)పై హెలికాప్టర్(Helicopter) కలకలం సృష్టించింది. ఆనంద నిలయం మీదిగా హెలికాప్టర్ వెళ్లింది. శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి ఎలాంటి విమానాలు, హెలికాప్టర్లు వెళ్లకూడదనే నిబంధన ఉంది. అయినా హెలికాప్టర్ వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన నిబంధనలను సైతం పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పదే పదే శ్రీవారం ఆలయంపై హెలికాప్టర్లు వెళ్లడాన్ని తప్పుబట్టారు. ఆగమశాస్త్ర(Agama Shastra) ఉల్లంఘనపై మండిపడ్డారు. టీటీడీ(TTD) భ్రదతా లోపాలపై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి ఆలయం గోపురంపై నుంచి హెలికాప్టర్ వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు సైతం టీటీడీ అధికారులపై విమర్శలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి టీడీపీ కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.






