- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పాజీ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం
అప్పాజీపల్లి గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో కొల్చారం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డారు.

దిశ, కొల్చారం: అప్పాజీపల్లి గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో కొల్చారం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన లక్ష్మణ్ విధులు ముగించుకుని హోండా యాక్టివా స్కూటీపై మెదక్ వైపు వెళ్తుండగా, అప్పాజీపల్లి పాఠశాల సమీపంలోని మూలమలుపు వద్ద గ్రామానికి చెందిన పెద్దోళ్ల భూమయ్య తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై యూటర్న్ తీసే క్రమంలో లక్ష్మణ్ ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో లక్ష్మణ్‌కు తీవ్ర రక్తగాయాలు కాగా, భూమయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కొల్చారం ఎస్సై మహమ్మద్ మొహీనుద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్ సాయంతో క్షతగాత్రులను మెదక్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






